Kohli Vs Gambhir: ఐపీఎల్‌ జట్లు లక్నో మరియు బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా విరాట్‌ కోహ్లీ మరియు గౌతమ్ గంభీర్ ల మధ్య జరిగిన మాటల యుద్దం క్రికెట్‌ అభిమానులతో పాటు సీనియర్ క్రికెటర్స్ కి కూడా చిరాకు తెప్పించింది అనడంలో సందేహం లేదు. జెంటిల్ మెన్‌ గేమ్ ను కాస్త గల్లీ స్థాయి ఆటకు తీసుకు వచ్చారని క్రీడా పండితులు కూడా వారిపై విమర్శలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే ఇద్దరికి కూడా నూరు శాతం మ్యాచ్ ఫీజ్ లో కోత విధించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారం లో ఎవరిది తప్పు అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. గంభీర్‌ అత్యుత్సాహం ప్రదర్శించాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే విరాట్ కోహ్లీ ఆవేశం కారణంగానే ఈ వివాదం జరిగిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


ఆ సమయంలో ఎవరు ఏమన్నారు అనే విషయమై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆట చివరికి చేరుకున్న సమయంలో కోహ్లీ తో లక్నో బ్యాట్స్ మెన్ గొడవ జరిగిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఎంపైర్లు అక్కడే ఉండటంతో వెంటనే వారి మధ్య గొడవ పెద్దది కాకుండా జాగ్రత్త పడ్డారు. మ్యాచ్ పూర్తి అయిన తర్వాత కోహ్లీ తో లక్నో ఆటగాడు అసలు గొడవ ఏంటి అంటూ మేయర్స్ అడిగినట్లుగా తెలుస్తోంది. 


ఆ సమయంలో కోహ్లీ ఏదో సమాధానం చెప్పబోతూ ఉండగా మేయర్స్ ని చేయి పట్టుకుని గంభీర్ అక్కడ నుండి తీసుకు వెళ్లాడు. కోహ్లీ తో మాట్లాడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా మేయర్స్ ను గంభీర్‌ తీసుకు వెళ్లడంతో వీడియో లో కనిపిస్తుంది. తాను మాట్లాడుతూ ఉండగా మేయర్స్ ని లాక్కు వెళ్లడంపై కోహ్లీకి కోపం వచ్చింది. దాంతో వెంటనే స్పందించాడు. 


Also Read: KKR Squad Update: కేకేఆర్ జట్టులోకి హార్డ్ హిట్టర్ ఎంట్రీ.. ఇక బౌలర్లకు దబిడి దిబిడే..!


మేము మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నువ్వు ఎందుకు వస్తున్నావు అంటూ గంభీర్‌ ను ఉద్దేశించి కోహ్లీ వ్యాఖ్యలు చేసినట్లుగా ఉన్నాడు. అప్పుడు వెంటనే గంభీర్‌ స్పందిస్తూ.. నువ్వు నా జట్టు ఆటగాడిని తిడితే నా ఫ్యామిలీ మెంబర్స్ ను తిట్టినట్లే అంటూ అక్కడ నుండి వెళ్లబోయాడు. అందుకు కోహ్లీ అయితే నీ కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అంటూ రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశాడట. 


దాంతో గంభీర్ వెనక్కి తిరిగి వచ్చి అంటే నేను నీ దగ్గర నేర్చుకోవాలా అంటూ కోహ్లీ మీదకు వెళ్లాడట. అలా ఇద్దరి మధ్య మాట మాట ముదిరి  చాలా దూరం వెళ్లింది అంటూ వీడియోకు రన్నింగ్ కామెంట్రీ చెబుతూ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ముందు ముందు అయినా గొడవ సర్ధుమనిగేనో చూడాలి.


Also Read: LSG vs CSK: టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. మ్యాచ్‌కు కెప్టెన్ దూరం.. కొత్త సారథిగా ఎవరంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


 ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి